పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో చింతలపూడి మండలంలో ఓ గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థిని పాఠశాలలో మధ్యాహ్నం తోటి స్నేహితులతో కలిసి భోజనం చేసింది. అనంతరం పాఠశాల భవనం రెండవ అంతస్థులో కిటీకికి చున్నితో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తోటి విద్యార్థిని చూసి సంరక్షురాలికి సమాచారం అందించింది. కిందకు దింపి స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే విద్యార్థిని మృతి చెందింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, వామపక్ష నాయకులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. పోలవరం సీఐ మూర్తి, ఎస్ ఐ సాదిక్ మృతదేహన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
మనస్తాపంతో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య - student commits suicide
మనస్తాపంతో పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలంలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
![మనస్తాపంతో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య student commits suicide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6432210-137-6432210-1584381251711.jpg)
మనస్తాపంతో పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్య..!