కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో అన్నదానం కార్యక్రమాన్ని నిలిపివేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం ఆలయ అధికారులు అప్రమత్తం అయ్యారు. నేటి నుంచి అన్నప్రసాద వితరణ నిలిపివేశారు. భక్తులకు కేవలం పులిహోర, దద్దోజనం ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు.
కొవిడ్ విజృంభణ... ఆలయాల్లో అన్నప్రసాద వితరణ నిలిపివేత - ఏపీలో తాజా వార్తలు
రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో అన్నదానం, ప్రసాదాల వితరణను నిలిపివేశారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల, తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు.
stop distribution