రాష్ట్ర జైళ్లశాఖ డీఐజీ శ్రీనివాసరావు పశ్చిమగోదావరి జిల్లా ఏలురు కారాగారాన్ని సందర్శించారు. రికార్డులు తనిఖీ చేసి.. డిజిటల్ భద్రతను, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. తాగునీటి ప్లాంటును ప్రారంభించారు. జైళ్లలో కరోనా నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు డీఐజీ తెలిపారు. దోషులకు ముందుగా కొవిడ్ పరీక్షలు నిర్వహించి, అనంతరం సాధారణ కారాగారంలోకి పంపుతామని స్పష్టం చేశారు. అందుకు ప్రత్యేక ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
'కారాగారంలో కరోనా పరీక్షలకు ప్రత్యేక ఏర్పాట్లు' - ఏలురు కారాగారం వార్తలు
రాష్ట్ర జైళ్లశాఖ డీఐజీ శ్రీనివాసరావు ఏలూరులోని కారాగారాన్ని సందర్శించారు. దోషులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించి, అనంతరం సాధారణ కారాగారంలోకి పంపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. జైలులోని డిజిటల్ భద్రత, ఇతర సౌకర్యాలను పరిశీలించారు.
రాష్ట్ర జైళ్లశాఖ డీఐజీ శ్రీనివాసరావు