పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఏరియా ఆస్పత్రిని... జిల్లా కేంద్ర ఆస్పత్రిగా మార్చేందుకు నిర్మాణ పనులు చేపట్టారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అప్గ్రేడ్ పనులకు శంకుస్థాపన చేశారు. వైద్యఆరోగ్య శాఖకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతని ఇస్తుందని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వైద్యఆరోగ్య శాఖకు రూ.16 వేల కోట్లు కేటాయిచామని అన్నారు.
లాక్‌డౌన్ సడలింపుతోనే కేసుల పెరుగుదల: మంత్రి ఆళ్ళ నాని - తణుకు ఏరియా ఆసుపత్రి వార్తలు
తణుకు ఏరియా ఆస్పత్రిని జిల్లా కేంద్ర ఆస్పత్రిగా మార్చేందుకుగానూ... చేపడుతున్న పనులకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శంకుస్థాపన చేశారు. లాక్‌డౌన్ సడలింపుల వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు.

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఏరియా ఆస్పత్రి నిర్మాణ పనుల్లో పాల్గొన్న మంత్రి ఆళ్ల నాని
లాక్‌డౌన్ నిబంధనలు సడలించడం వల్లే కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని నాని అభిప్రాయపడ్డారు. ప్రధాని సూచనల మేరకు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు రంగనాథరాజు, తానేటి వనిత పాల్గొన్నారు.
ఇదీ చదవండి:దేశంలో మరో 11,502 కేసులు.. 325 మరణాలు