రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచి నిర్వహించాలని మాజీమంత్రి, భాజపా నేత పైడికొండల మాణిక్యాలరావు డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహించాలని కోరారు. అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సాక్షాత్తు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కే రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. ఎన్నికల అక్రమాలను ప్రశ్నించిన వారిపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు వచ్చే అభ్యర్థులను బెదిరింపులకు గురిచేసి నామినేషన్ వేయకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు. వైకాపా ఆగడాలు సోషల్ మీడియాలో వెలుగు చూశాయని గుర్తుచేశారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని సస్పెన్షన్‌లో పెట్టి ఎన్నికలు నిర్వహించాలని మాణిక్యాలరావు డిమాండ్ చేశారు.
'సీఈసీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి'
స్థానిక సంస్థల ఎన్నికలను... కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో మొదటి నుంచి జరపాలని భాజపా నేత పైడికొండల మాణిక్యాలరావు కేంద్రాన్ని కోరారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులను భయపెట్టి... ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో వైకాపా ఏకగ్రీవాలు చేసుకుందని ఆయన ఆరోపించారు.
bjp manikyala rao