పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు నిర్వహించారు. పట్టణ ప్రధాన రహదారిలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి స్థానిక శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ అవతరణకు పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలు మరువలేనివని ఆయన అన్నారు. అనంతరం స్వీట్లు పంచుకున్నారు.
ప్రజలకు ఇబ్బంది రాకుండా.. సీఎం జగన్ 3 రాజధానులు ఏర్పాటు చేయాలనుకున్నట్లు వెంకట నాగేశ్వరరావు చెప్పారు. రాజధాని ప్రాంతంలో తెదేపా అధినేత చంద్రబాబు ఇన్సైడ్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. కేసు నమోదైతే స్టే తెచ్చుకుని అక్రమాలు చేశారని ఆరోపించారు. త్వరలోనే తణుకులో గాంధీ మహాత్ముడు, పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాలను ప్రతిష్టించనున్నామన్నారు.