వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేటి సంక్షేమ పథకాలే... రాబోయే తరాలకు ఉపయోగపడతాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం పి.యం.లంకలో ఆయన పర్యటించారు. డిజిటల్ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... డిజిటల్ భవనంలో మౌలిక వసతులు కల్పించాలని... భవనం చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టాలని అధికారులు ఆదేశించారు. అనంతరం పాఠశాల గురించి గ్రామస్థులు మంత్రికి తెలపగా... సబ్ కలెక్టర్ సందర్శించి... తగు చర్యలు చేపట్టాలని సూచించారు.
నేటి సంక్షేమ పథకాలే... భావితరాలకు పెట్టుబడి..! - State Finance Minister Buggana Rajendranath visits at pedamainavani lanka news
కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ దత్తత గ్రామమైన... పెదమైనవాని లంకను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సందర్శించారు.
గ్రామస్థులతో మాట్లాడుతున్న మంత్రి