ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేల్పూరు స్వీట్స్.. వరల్డ్ ఫేమస్

పండుగలు.. శుభకార్యాలు.. వేసవి సెలవులు వచ్చాయంటే... ఒకప్పుడు పిండివంటల తయారీతోనే సందడి మొదలయ్యేది. ఉరుకుల పరుగుల జీవితాల్లో ఇంటిల్లిపాదికీ నెలరోజులు సరిపడా పిండివంటలు తయారుచేసే పరిస్థితులు ఇప్పుడు లేవు. ఈ లోటు తీరేలా పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ గ్రామ సంప్రదాయ పిండివంటల రుచిని అందిస్తోంది. ఆ గ్రామంలో తయారైన స్వీట్లు అంటే జిల్లా, రాష్ట్రమే కాదు విదేశాల్లోనూ క్రేజ్.

special story on velpuru sweets
వేల్పూరు స్వీట్స్

By

Published : Dec 5, 2020, 4:38 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే చాలా శుభ కార్యాల్లో అతిథులకు వేల్పూరు పిండి వంటలు నోరూరిస్తాయి. విదేశాల్లో స్థిరపడినవాళ్లు ఏడాదికోసారైనా వీటిని పంపించాలని ఇంట్లో వారిని అడుగుతారు. విదేశాలకు పంపించేవారికి అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని నాణ్యంగా, నిల్వ ఉండేలా ప్రత్యేక పద్ధతిలో తయారు చేసి ఇస్తున్నారు. వ్యాపార ప్రారంభ దశలో వారానికి ఒకసారి చుట్టుపక్కల గ్రామాల్లో, పట్టణాల్లో జరిగే సంతలో అమ్మేవారు.. వ్యాపారం విస్తరించిన తర్వాత ఇంటివద్దే తయారు చేస్తూ వినియోగదారులకు అందిస్తున్నారు. ఇంట్లో చేసినంత నాణ్యంగా అందుబాటు ధరలో ఉండటంతో డిమాండ్‌ బాగుంటోందని దుకాణాల నిర్వాహహకులు అంటున్నారు.

పిండి వంటలు తయారీ చేసేచోట.. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి.. తమ నాణ్యతపై అందరికీ నమ్మకం కలిగించేలా చేసిన ప్రయత్నం సత్ఫలితాలిచ్చిందని దుకాణదారులు చెబుతున్నారు. నాణ్యతతోపాటు రుచీ ఉంటాయని అందుకే ఇక్కడ కొంటామని వినియోగదారులు అంటున్నారు. వేల్పూరులో తయారయ్యే స్వీట్లతో తమ గ్రామానికి గుర్తింపు రావటం సంతోషంగా ఉందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వేల్పూరు స్వీట్స్

ఇదీ చదవండి: అసెంబ్లీ తీర్మానం రాజ్యాంగ విరుద్ధం: ఎస్‌ఈసీ

ABOUT THE AUTHOR

...view details