ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆషాడమాస శాకాంబరీగా కనకదుర్గమ్మ - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరంలోని పాలంగిలో శాకాంబరీ ఆలయంలో కొలువైవున్న కనకదుర్గమ్మవారు శుక్రవారం శాకాంబరీగా భక్తులకు దర్శనమిచ్చింది. ఆషాడ మాసం మూడో వారంలో శుక్రవారం అమ్మవారిని శాకాంబరీగా అలంకరించడం ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో కరోనా నిబంధనలకు అనుగుణంగా భక్తులకు దర్శన అవకాశం కల్పించారు ఆలయ నిర్వాహకులు.

special puja at eastgodavari temple
ఆషాడమాస శాకాంబరిగా... కనకదుర్గమ్మ భక్తులకు దరశనభాగ్యం

By

Published : Jul 10, 2020, 3:17 PM IST

Updated : Jul 11, 2020, 9:46 AM IST

పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాడవరం మండలం పాలంగిలో కొలువైవున్న శాకాంబరీ ఆలయంలో కనకదుర్గమ్మ వారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాడ మాసం మూడో వారంలో శుక్రవారం అమ్మవారిని శాకాంబరీగా అలంకరించడం ఆనవాయితీ.

జిల్లాలో ప్రసిద్ధి చెందిన కనకదుర్గ అమ్మవారిని టన్ను బరువు గల వివిధ రకాల కూరగాయలతో శోభాయమానంగా అలంకరించారు. శాకంబరీ అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే సర్వ శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఆలయ నిర్వాహకులు భక్తులు దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు.

ఆలయ ప్రాంగణంలో లోకరక్షణార్ధం శ్రీ లక్ష్మీ గణపతి హోమం, చండీ హోమం, శాంతి హోమం నిర్వహించగా... భక్తుల సహాయ సహకారాలతో హోమం జరిపినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఇవీ చదవండి:'క్రిమినల్​ పోయాడు.. మరి కేసు సంగతేంటి?'

Last Updated : Jul 11, 2020, 9:46 AM IST

ABOUT THE AUTHOR

...view details