పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం చివటం గ్రామం వద్ద అక్రమంగా తరలిస్తున్న నాటుసారాను ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి... ద్విచక్రవాహనంపై 15 లీటర్ల నాటుసారాను రవాణా చేస్తుండగా గుర్తించిన పోలీసులు సారాను, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై అరెస్టు చేశారు. ఇరగవరం మండలం రేలంగిలో అక్రమంగా మద్యం సీసాలు కలిగిన ఉన్న వ్యక్తిని అరెస్టు చేసి, మద్యం స్వాధీనం చేసుకున్నారు.
నాటుసారా పట్టివేత... ఇద్దరు అరెస్టు - west godavari district news today
పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండ్రాజవరం, ఇరగవరం మండలాల్లోని పలు గ్రామాల్లో ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో నాటుసారాను స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లాలో నాటుసారా పట్టివేత