ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అభిమానం ప్రతిరూపం అయ్యింది! - duvva sp bala subramanyam idol update

తన గానామృతంతో యావత్ దేశంలో సంగీత ప్రియులను ఉర్రూతలూగించారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. అజరామరమైన పాటలతో ఎందరికో అభిమాన గాయకుడుగా మారారు. అంతటి ఘనకీర్తి ఆపాదించుకున్న బాలు ఇక లేరన్న వార్త అభిమానులను దుఃఖ సాగరంలో ముంచింది. తన అభిమాన నాయకుడికి ప్రతి రూపం తన ముందు ఉండాలన్న ఆకాంక్ష ఆ శిల్ప కళాకారుడిని పురికొల్పింది. ఆ కళాకారుడి నైపుణ్యం బాలు ప్రతిరూపాన్ని విగ్రహ ఆవిష్కరణ చేసింది.

sp bala subramanyam idol
దువ్వలో ఎస్పీ బాల సుబ్రమణ్యం విగ్రహం

By

Published : Oct 6, 2020, 11:23 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన చంద్రశేఖర్​కు సినీ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటే చిన్నతనం నుంచి ఎనలేని అభిమానం. ఆయన గానామృతాన్ని వింటూ మైమరచిపోతారు. తమ అభిమాన గాయకుడు మృతి చెందడం చంద్రశేఖర్​ను బాధించింది. స్వతహాగా శిల్పి అయిన చంద్రశేఖర్ తమ అభిమాన నాయకుడి ప్రతి రూపాన్ని ఆవిష్కరించాలని భావించారు.

అనుకున్నదే తడవుగా విగ్రహానికి రూపొందించారు. విగ్రహంలోని అణువణువు తనదైన నైపుణ్యంతో తీర్చిదిద్ది సజీవ రూపం ఆపాదించారు. తమ అభిమాన గాయకుడు ప్రతిరూపాన్ని తమ ముందు కనిపించేలా ఉండాలన్న కోరికతో విగ్రహం రూపొందించానని, తన శిల్పకళా వేదికకు వచ్చే వారు చూసి తరించాలని చంద్రశేఖర్ ఆకాంక్షించారు. అభిమాన గాయకుడి విగ్రహాన్ని తీర్చిదిద్దిన చంద్రశేఖర్​ను పలువురు అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details