ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసాపురం రైల్వేస్టేషన్​ అభివృద్ది పనులను పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం

రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇచ్చేందుకు నిరాకరించటంతోనే పలు మార్గాల్లో పనులు ఆలస్యమవుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానాన్ మాల్యా అన్నారు. నరసాపురం, రాజమహేంద్రవరం సహా పలు రైల్వే స్టేషన్లను ఆయన సందర్శించారు.

గజానన్ మాల్యా
గజానన్ మాల్యా

By

Published : Sep 4, 2021, 1:00 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా పరిశీలించారు. అనంతరం స్టేషన్ లో 10కోట్లతో నిర్మించిన రెండోవ రైల్వే ఫిట్ లైన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం గజానన్ మాల్యా మాట్లాడుతూ విజయవాడ - నరసాపురం రైల్వే డబ్లింగ్ లైన్ పనులను 2022 మార్చి నాటికి పూర్తి చేస్తామన్నారు. కోటిపల్లి- నరసాపురం రైల్వే లైన్ పనులు పూర్తవ్వడనికి మరో రెండేళ్లు పడుతుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇచ్చేందుకు నిరాకరించటంతోనే పలు మార్గాల్లో పనులు ఆలస్యమవుతున్నాయని గజానాన్ మాల్యా అన్నారు. నర్సాపురం, పాలకొల్లు, తణుకు, నిడదవోలు రైల్వే స్టేషన్లలో అదనపు ఫ్లాట్ ఫారంలు, ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండి:

శ్రీవారి భక్తులకు రుచి, శుచితో కూడిన అన్నప్రసాదాలు: తితిదే ఈవో

ABOUT THE AUTHOR

...view details