ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దారుణం.. భార్య, అత్తను నరికి చంపిన అల్లుడు - కుటుంబ కలహాలతో భార్యను,అత్తను నరికి చంపిన అల్లుడు

పశ్చిమ గోదావరి జిల్లా దొండపాడులో దుర్ఘటన చోటుచేసుకుంది. ఆలు, మగల మధ్య గొడవ హత్యలకు దారితీసింది. ఆగ్రహంతో ఓ వ్యక్తి..భార్య, అత్తలపై కత్తితో దాడిచేసి చంపేశాడు. అడ్డువచ్చిన బావమరిదిని తీవ్రంగా గాయపరిచాడు.

కుటుంబ కలహాలతో భార్యను,అత్తను నరికి చంపిన అల్లుడు

By

Published : Jul 19, 2019, 8:08 PM IST

Updated : Jul 20, 2019, 4:09 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపాడులో దారుణం చోటుచేసుకొంది. ఓ వ్యక్తి కుటుంబ కలహాలతో భార్య, అత్తలపై కత్తితో దాడి చంపాడు. దాడిని అడ్డుకోడానికి ప్రయత్నించిన బావమరిదిని తీవ్రంగా గాయపరిచాడు. దొండపాడుకు చెందిన కాంతారావు, ఆయన భార్య పుష్పలత గత కొంతకాలంగా గొడవలు పడుతున్నారు. ఆ గొడవలు తీవ్రరూపం దాల్చి కాంతారావు..శుక్రవారం దాడికి ప్రయత్నించాడు. భార్య పుష్పలత, అత్త లక్ష్మిను కత్తితో నరికి చంపాడు. అడ్డుకోబోయిన బావమరిది పైనా దాడి చేశాడు. ఈ దాడిలో బావమరిది తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ అతడ్ని రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే హత్యలకు కారణమని పోలీసులు తెలిపారు.

Last Updated : Jul 20, 2019, 4:09 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details