తణుకు పాత ఊరికి చెందిన పెద్ద నాగేశ్వరావు లక్ష్మీ దంపతుల కుమార్తె వరలక్ష్మిని హైదరాబాదుకు చెందిన దుర్గా ప్రసాద్‌కి ఇచ్చి 7 నెలల కిందట వివాహం చేశారు. పెళ్లైన తర్వాత హైదరాబాద్ వెళ్లిన భర్త తాగుడికి బానిస కావటంతో ఇరువురి మధ్య వివాదం జరిగింది. వారం రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. భార్య కోసం తణుకు వచ్చిన దుర్గాప్రసాద్... భార్యను తనతో పంపించాలని అత్తతో గొడవ పడ్డాడు. వివాదంలో అత్తను కత్తితో పొడిచాడు. కత్తిపోట్లు గట్టిగా తగలడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు...నిందితుడు దుర్గాప్రసాద్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. మద్యం తాగవద్దన్నందుకు తన తల్లిని చంపాడని మృతురాలి కుమార్తె తెలిపారు.
భార్యను కాపురానికి పంపలేదని అత్తను చంపిన అల్లుడు - murder news in west godavari
పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని దారుణం జరిగింది. పాతూరులో కుటుంబ కలహలతో అల్లుడే అత్తను కత్తితో నరికి చంపాడు.
దారుణం: అత్తను కత్తితో పొడిచి చంపిన అల్లుడు