పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థకు గురై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పరామర్శించారు. బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఒక్కసారిగా ప్రజలు అస్వస్థతకు గురికావటం పలు అనుమానాలకు తావిస్తోందని సోమువీర్రాజు అన్నారు. దీనిపై సమగ్ర పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మంగళగిరి ఎయిమ్స్ నుంచి వైద్య బృందాన్ని కేంద్రప్రభుత్వం పంపిందని తెలిపారు.
ఏలూరు బాధితులను పరామర్శించిన సోమువీర్రాజు - ఏలూరు ప్రధాన వార్తలు
ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పరామర్శించారు. మంగళగిరి ఎయిమ్స్ నుంచి వైద్య బృందాన్ని కేంద్ర ప్రభుత్వం ఏలూరుకు పంపిందని తెలిపారు.
బాధితులను పరామర్శిస్తున్న సోమువీర్రాజు