పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. పాలి గ్రామానికి చెందిన శ్రీనివాస్ పద్మావతి దంపతులు ఎనిమిదేళ్లుగా కొంతమంది గ్రామస్థుల వద్ద అప్పులు చేశారు. వాటిని తీర్చాలంటూ దంపతుల ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు. తాజాగా వరలక్ష్మి అనే మహిళ అప్పుగా తీసుకున్న సొమ్ము తిరిగి ఇవ్వమని అడగడంతో వివాదం చెలరేగింది. వరలక్ష్మికి మిగిలిన బాధితులు మద్దతుగా నిలిచారు. శ్రీనివాస్ పద్మావతి కుటుంబీకులకు, బాధితులకు మధ్య కొట్లాట జరగడంతో రెండు వర్గాలకు చెందిన వారికి గాయాలయ్యాయి. అప్పు తిరిగి ఇవ్వమని అడిగితే కొట్లాటకు సిద్ధమవుతున్నారని బాధితులు చెప్తున్నారు. ఇరు వర్గాల వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
అప్పు చెల్లించమంటే ఘర్షణకు దిగారు! - athili latest news
అప్పు చెల్లించమని అడిగే క్రమంలో జరిగిన ఘర్షణలో ఇరు వర్గాల వారికి గాయాలయ్యాయి. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.
అప్పు చెల్లించమంటే ఘర్షణకు దిగారు!