పశ్చిమగోదావరి జిల్లాలోని... సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల, ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు కోసం స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. జేఈఈ మెయిన్స్ పరీక్షలో జిల్లా నుంచి 87 మంది ఉత్తీర్ణత సాధించారని జిల్లా పాలనాధికారి రేవు ముత్యాలరాజు తెలిపారు. ఈ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో 250 మందికి స్ఫూర్తి కార్యక్రమం ద్వారా ప్రత్యేక శిక్షణ ఇవ్వగా... 87 మంది ఉత్తీర్ణులయ్యారని, వీరందరూ ఈనెల 27వ తేదీన నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ పరీక్ష రాయనున్నారని తెలిపారు. జూమ్ యాప్ ద్వారా స్ఫూర్తి శిక్షణ కార్యక్రమం నిర్వహించామని... 8 నెలల్లోనే ఇంతమంది ఫలితాలు సాధించడం చాలా ఆనందంగా ఉందని వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
జేఈఈలో సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ - social welfare students of west godavari qualified in jee
పశ్చిమగోదావరి జిల్లాలోని... సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల, ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఈ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో 250 మందికి స్ఫూర్తి కార్యక్రమం ద్వారా ప్రత్యేక శిక్షణ ఇవ్వగా... వీరిలో 87 మంది ఉత్తీర్ణులయ్యారని జిల్లా పాలనాధికారి ముత్యాలరాజు తెలిపారు.
జేఈఈలో సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల విద్యార్థుల ఉత్తీర్ణత