ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొలం పనులకువెళ్లి.. పాముకాటుతో బాలుడు మృతి - పశ్చిమగోదావరి జిల్లాలో పాముకాటుతో బాలుడు మృతి

చదువుకుంటూ ఖాళీ సమయంలో తండ్రికి వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటున్న బాలుడిని పాము రూపంలో మృత్యువు కబళించింది. అమ్మా.. నాన్నతో పొలం వెళ్తున్నా అని చెప్పిన తన బిడ్డ ఇక లేడన్న విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పటి వరకు తన కళ్ళ ముందే ఉన్న కుమారుడు కొద్దిసేపటికే విగతజీవిగా మారడంతో ఆ తల్లితండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలో చోటుచేసుకుంది.

snake bite boy
snake bite boy

By

Published : Nov 6, 2020, 10:46 PM IST

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నీలాద్రిపురం గ్రామానికి చెందిన కొనకళ్ల శ్రీనివాసరావు, భవాని దంపతులకు కుమార్తె శైలజ, కుమారుడు మహేష్ (14) సంతానం. శ్రీనివాసరావు ఉంగుటూరు శివారులోని కొంత పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం చేలో వరి కోత యంత్రంతో కోత కోయిస్తుండగా.. వారితో పాటు కుమారుడు మహేష్ చేలో పని చేస్తున్నాడు.

ఈ క్రమంలో మహేష్ పాముకాటుకు గురయ్యాడు. హుటాహుటిన బాలుడిని ద్విచక్ర వాహనంపై కుటుంబ సభ్యులు తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఆస్పత్రిలో కొవిడ్ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని అక్కడ సిబ్బంది చెప్పడంతో.. తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మహేష్ చెందాడు.

ABOUT THE AUTHOR

...view details