పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో రైతులు పొలం పనులు చేసుకుంటుండగా ... అయిదు అడుగులున్న రెండు తలల పాము కనిపించింది. వారు దానిని ఒక కుండలో పెట్టి గ్రామానికి తీసుకువెళ్లారు. వింతగా ఉన్న ఆ రెండు తలల పామును చూసేందుకు గ్రామస్థులు ఆసక్తి కనబరిచారు. అటవీ అధికారులకు సమాచారామిచ్చినట్లు స్థానికులు చెప్పారు.
పంటచేనులో రెండు తలల పాము... ఆసక్తిగా తిలకించిన జనం - తాడేపల్లిగూడెం వార్తలు
పశ్చిమ గోదావరి జిల్లాలో... పొలం పనులు చేసుకుంటున్న రైతులకు రెండు తలల పాము కనిపించింది. దానిని గ్రామానికి తీసుకురావడంతో గ్రామస్థులు ఆసక్తిగా తిలకించారు. సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు.
పొలం పనులు చేస్తుండగా పాము ప్రత్యక్షం