ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాఠశాలలో కరోనా కలకలం.. ఒక్క విద్యార్థీ హాజరు కాని వైనం! - నల్లజర్లలో విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో బయటపడిన కరోనా వైరస్

విద్యాలయంలో కరోనా కలకలం సృష్టించింది. నెలల తర్వాత ప్రారంభమైన కొద్ది రోజులకే.. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోని ఓ పాఠశాలను కోవిడ్ కుదిపేసింది. వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో 12 మంది విద్యార్థులతో పాటు నలుగురు ఉపాధ్యాయులకు వైరస్ సోకిందని ఆరోగ్య సిబ్బంది తెలిపారు.

covid cases in school
పాఠశాలలో 16 కొవిడ్ కేసులు

By

Published : Nov 5, 2020, 5:01 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోని ఓ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో.. కరోనా కలకలం రేపింది. విద్యాలయాలు పునః ప్రారంభించడంలో భాగంగా వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఏకంగా.. 12 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులకు కొవిడ్ నిర్థారణ అయింది. రోజూ 50 శాతం మంది హాజరయ్యే బాలలు.. ఈరోజు ఒక్కరు కూడా హాజరు కాలేదు. విద్యార్థుల తల్లిందండ్రులతో పాటు మిగతా ఉపాధ్యాయులు భయాందోళనకు గురవుతున్నారు.

144 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటికే 16 మందికి వైరస్ సోకినట్లు గుర్తించామని వైద్యులు పేర్కొన్నారు. మరో 39 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందని చెప్పారు. పాజిటివ్ వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులను హోమ్ క్వారంటైన్​లలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details