దేవీ నవరాత్రుల ముగింపులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలం భూదేవిపేట గ్రామంలో వసంతవాడు వాగులో స్నానానికి దిగిన ఆరుగురు యువకులు వాగులో గల్లంతయ్యారు. స్థానికులు నలుగురి మృత దేహాలను బయటకు తీయగా... మరో ఇద్దరి ఆచూకీ లభించాల్సి ఉంది.
మృతులు శ్రీరాముల శివాజీ, గంగాధర్ వెంకట్, కునరాల రాధాకృష్ణ, కర్నాటి రంజిత్ గా గుర్తించారు. ఇంకా కెల్లా భువన్, గొట్టపర్తి మనోజ్ ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది. సమాచారం అందుకున్న సీఐ బాల సురేష్, ఎస్సై ఘటన స్థలానికి చేరుకున్నారు. వేలేరుపాడు విషాద ఘటనపై పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.