పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండల కేంద్రంలోని కృషి విజ్ఞాన కేంద్రం రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, భారత వ్యవసాయ పరిశోధనా మండలి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో.. శాస్త్రవేత్తలు సాధించిన ప్రగతి, తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే మంతెన రామరాజు, ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఏపీ వ్యవసాయ మిషన్ ఛైర్మన్ నాగిరెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
సోమరిపోతు వ్యవసాయం: మంత్రి