పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు ఎస్.ఐ శ్రీహరిరావు తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కరోనా మహమ్మారిని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేదలకు ఎస్సై తన సొంత ఖర్చుతో వారికి భోజనం పంపిణీ చేశారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకూడదని.. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు.
పేదల ఆకలి తీర్చిన ఎస్ఐ - lockdown
లాక్డౌన్ కారణంగా ఉపాధి లభించక పస్తులుంటున్న వారికి పలువురు దాతలు సహాయం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు ఎస్ఐ తన సొంత ఖర్చులతో పేదలకు భోజనాన్ని పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
పేదలకు భోజనం పంపిణీ చేస్తున్న భీమడోలు ఎస్సై