ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీవైఎన్ కళాశాల డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్ష ఫలితాలు విడుదల - shriYN college degree final year results

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం శ్రీవైఎన్ కళాశాల( అటానామస్) డిగ్రీ చివరి సంవత్సరం పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సెక్రటరీ కరస్పాండెంట్ డా. చినమిల్లి సత్యనారాయణ రావు అభినందించారు.

ShriYN College Degree Final Year Exam Results
డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్ష ఫలితాలు విడుదల చేస్తున్న శ్రీవైఎన్ కళాశాల పాలకవర్గం

By

Published : Oct 18, 2020, 12:21 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం శ్రీవైఎన్ కళాశాల డిగ్రీ చివరి సంవత్సరం పరీక్ష ఫలితాలను పాలకవర్గ సభ్యుడు పోలిశెట్టి శ్రీరఘు రామారావు విడుదల చేశారు. బీఎస్సీలో 82, బీకాం- 91, బీఏ-95 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ ఎస్.ఎం.మహేశ్వరి తెలిపారు.

ఎం.శ్రీమయి (బీఎస్సీ)- 100% మార్కులు, పి.భవాని (బీకాం)- 90.3 శాతం, బీఏలో 85 శాతం మార్కులతో కళాశాల ప్రథమ స్థానంలో నిలిచారన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సెక్రటరీ కరస్పాండెంట్ డా. చినమిల్లి సత్యనారాయణ రావు, ఉపాధ్యక్షుడు జీవికే రామారావు, కోశాధికారి పొన్నపల్లి శ్రీరామారావు, పాలకవర్గం సభ్యులు అభినందించారు. కార్యక్రమంలో కంటోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ కేసి ఎస్వీ రమణ, సీహెచ్ ఉదయ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పల్లె వాసి ఏలియా.. షిల్లాంగ్ వీసీ

ABOUT THE AUTHOR

...view details