పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం మీనానగరం వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఓ పాఠశాల బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. దేవరపల్లి మండలం గౌరిపట్నంలోని నిర్మలగిరి పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులతో బయలుదేరింది. 25 మంది విద్యార్థులను తీసుకుని చాగల్లు వైపు వెళ్తుండగా... ఇంజన్ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. చాకచక్యంగా వ్యవహరించిన డ్రైవర్ విద్యార్థులను వెంటనే కిందకు దింపేయ్యటంతో పెను ప్రమాదం తప్పింది. బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు డ్రైవర్ తెలిపాడు. స్థానికులు మంటలను ఆర్పడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. పాఠశాలపై చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
స్కూల్ బస్సు దగ్ధం... విద్యార్థులకు తప్పిన ముప్పు
పశ్చిమ గోదావరి జిల్లా మీనానగరం వద్ద విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ తెలిపాడు.
షార్ట్ సర్యూట్తో స్కూల్ బస్సు దగ్ధం... విద్యార్ధులు క్షేమం