పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కరోనా కేసులు పెరుగుతున్నందున వర్తక, వాణిజ్య సంఘాలు స్వచ్ఛంద లాక్ డౌన్ పాటించేందుకు నిర్ణయించాయి. ఆది, మంగళ, శుక్రవారాల్లో తప్ప మిగిలిన రోజుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు దుకాణాలు తెరవడానికి అధికారులు అనుమతి ఇచ్చారు. అయినప్పటికీ వైరస్ విజృంభిస్తున్నందున వ్యాపార వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు దుకాణాలు తెరవకూడదని తీర్మానించాయి. తణుకు నియోజకవర్గంలో రోజుకు 150 నుంచి 200 వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
తణుకులో వ్యాపారుల స్వచ్ఛంద లాక్ డౌన్ - తణుకులో లాక్ డౌన్
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వర్తక, వ్యాపార వర్గాల వారు స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.
తణుకులో వ్యాపార వర్గాల స్వచ్ఛంద లాక్ డౌన్