రాష్ట్రంలో పశు జాతి అభివృద్ధి చెందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంలో మేలుజాతి పొట్టేళ్ల ప్రదర్శనను ఎమ్మెల్యే ప్రారంభించారు. జిల్లాలోని 13 మండలాల నుంచి ప్రదర్శనకు తమ పొట్టేళ్లను తీసుకొచ్చారు. వాటి నడక ద్వారా శరీర సౌష్టవాన్ని పరీక్షించి న్యాయనిర్ణేతలు మార్కులు వేశారు. పోటీకి వచ్చిన పొట్టేళ్లలో కొన్నింటికి వైకాపా జెండా రంగులు వేశారు. వాటిలో కొన్నింటికి జగన్, వైయస్సార్, బాలరాజు అని పేర్లతో నామకరణం రాశారు. అనంతరం బహుమతులు అందజేశారు. ఇలాంటి పోటీలు ఏర్పాటు చేయడంవల్ల పొట్టేళ్ల జాతి అభివృద్ధికి తోట పడినట్లు అవుతుందని పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు రామ కోటేశ్వర రావు తెలిపారు.
కొయ్యలగూడెంలో పొట్టేళ్ల "ర్యాంప్ వాక్" - కొయ్యలగూడెంలో పోట్టేళ్ల పోటీల వార్తలు
పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంలో మేలుజాతి పొట్టేళ్ల ప్రదర్శన ఆకట్టుకుంది.
![కొయ్యలగూడెంలో పొట్టేళ్ల "ర్యాంప్ వాక్" sheep ramp walk at koyyalagudem in west godavari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5527372-342-5527372-1577595635249.jpg)
నడుస్తున్న పోట్టేలు
కొయ్యలగూడెంలో పోట్టేళ్ల "ర్యాంప్ వాక్"