పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు గ్రామంలోవిషాదం చోటుచేసుకుంది. తెల్లారితే పరీక్షకు హాజరు కావాల్సిన ఓ అమ్మాయి... తల్లిని పోగొట్టుకుంది. ఏడేళ్ల క్రితం తండ్రి చనిపోయిన శాంతి శ్రీ ని.. ఇన్నాళ్లూ తల్లి లక్ష్మీదేవి కష్టపడి అన్నీ తానై పెంచింది. ఇవాల్టి పరీక్ష కోసం కూతురితో మాట్లాడుతూ నిన్న రాత్రి చాలా సేపు మెలకువగానే ఉంది. చాలా కాలం నుంచి పడిన కష్టాల గురించి ఇద్దరూ మాట్లాడుకున్నారు. కాసేపటికే.. లక్ష్మీదేవి గుండెపోటుతో కన్నుమూసింది. తల్లి మరణాన్ని శాంతి శ్రీ తట్టుకోలేకపోయింది. అంతలోనే తాను రాయాల్సిన ఇంటర్మీడియట్ రెండో సంవత్సరపరీక్ష గుర్తొచ్చింది. తాను జీవితంలో స్థిరపడాలన్న తల్లి ఆకాంక్ష గుర్తు చేసుకుంది.భవిష్యత్తు కోసం బాధను దిగమింగకుని పరీక్షకు హాజరైంది. శాంతి శ్రీ ఆవేదన చూసి.. ఆకివీడు గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు.