పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిని.. అదే గ్రామానికి చెందిన బత్తుల రమేష్ కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు. పెళ్లి చేసుకోకపోతే చనిపోతా అని బెదిరించాడు. బాలిక ఉండ్రాజవరం పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేశారు. యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసి, తణుకు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతనికి రిమాండ్ విధించినట్లు ఉండ్రాజవరం ఎస్ఐ తెలిపారు. పోక్సో చట్టం పట్ల అవగాహన లేని కారణంగానే ఇలాంటి వేధింపులు జరుగుతున్నాయన్నారు.
విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. నిందితుడికి రిమాండ్ - sexual harassment on 10th class student at west godavari dst undrajavaram
పదో తరగతి విద్యార్థినికి యువకుడి బెదిరింపుల వ్యవహారం.. పోలీసు స్టేషన్కు చేరింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఈ ఘటనలో.. నిందితుడు రిమాండ్ లో ఉన్నాడు.
పదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులు