ఏడో విడత ఉచిత రేషన్ పంపిణీ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. పశ్చిమగోదావరి జిల్లాలో 12 లక్షల 59 వేల 936 రేషన్ కార్డులు ఉన్నాయి. వీరందరికీ సరఫరా చేయడానికి 17,500 టన్నుల బియ్యాన్ని 750 టన్నుల పంచదార, కందిపప్పు రేషన్ దుకాణాలకు సరఫరా చేశారు.
నేటి నుంచి ఏడో విడత ఉచిత రేషన్ పంపిణీ - పశ్చిమ గోదావరిలో రేషన్ పంపిణీ
పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా ఏడో విడత ఉచిత రేషన్ పంపిణీ నేటి నుంచి ప్రారంభమైంది. కార్డులో ఉన్న ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం, ఒక కార్డుకు కిలో కందిపప్పు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కార్డుదారులకు అరకిలో పంచదార సరఫరా చేస్తున్నారు.
ఈ నెల ఒకటో తేదీ నుంచి రేషన్ కార్డుదారులకు డబ్బులు చెల్లించే పద్ధతిపై సరకులు సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.90 వేల కోట్ల వ్యయంతో నవంబర్ నెల వరకు ఉచితంగా సరఫరా చేయనున్నట్లు ప్రకటించారు. ప్రధాని ప్రకటనతో జరగాల్సిన రేషన్ పంపిణీ ఆగిపోయింది.. తాజాగా ఉచితంగా రేషన్ పంపిణీ చేయడానికి నిర్ణయించి.. నేటి నుంచి పంపిణీ ప్రారంభించారు. కార్డుదారులకు బియ్యం, కందిపప్పు ఉచితంగా ఇస్తూ పంచదారకు మాత్రం అరకిలో రూ.17 వంతున, అంత్యోదయ యోజన కార్డుదారులకు కిలో 13.50 రూపాయల వంతున వసూలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: విధులకు రాలేమంటూ.. డిపో మేనేజర్ కాళ్లపై పడ్డ ఆర్టీసీ కార్మికుడు