పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లిలో గోమాతకు సీమంతం నిర్వహించారు. కార్తికమాసం సందర్భంగా స్థానిక సాయిబాబా ఆలయంలో గోవుకు ప్రత్యేక పూజలు జరిపారు ఆలయ అర్చకుడు హరికృష్ణ. మహిళల ఆధ్వర్యంలో పిండివంటలు ఏర్పాటు చేసి తినిపించారు. కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లును ఆలయ కమిటీ సభ్యుడు వ్యాస మూర్తి చేశారు. గోమాతకు సీమంతం నిర్వహించడం ద్వారా సమసమాజ స్థాపనకు శ్రీకారం చుట్టవచ్చన్నారు
కార్తికమాసం: గోమాతకు సీమంతం - GILUGUMILLI LATEST NEWS
సంక్రాంతి, దసరా పండుగలొస్తేనే గోమాతకు పూజలు చేయటం సాధారణం. కార్తికమాసాల్లో ఆవుకు ప్రత్యేక పూజలు చేయటం మంచిదంటున్నారు పశ్చిమగోదావరి జిల్లా జిలుగుమిల్లి మహిళలు. ఆవుకు ప్రత్యేక పూజలు చేశారు. పిండివంటలు తినిపించారు.
గోమాతకు సీమంత పూజలు