పశ్చిమగోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో రెండో విడత రేషన్ పంపిణీకి సర్వర్ సమస్యలు అడ్డంకిగా మారాయి. జిల్లాలో సుమారు 12 లక్షల ఇరవై ఎనిమిది వేల రేషన్ కార్డులున్నాయి. అధికారులు ఇవాళ్టి నుంచి రెండో విడత పంపిణీని ప్రారంభించారు. అయితే ఈసారి తగినంత కందిపప్పు నిల్వలు లేకపోవడం వల్ల ఒక్కో కార్డుదారునికి బియ్యంతోపాటు కిలో శెనగలు అందజేశారు. మొదటిసారి పంపిణీలో వినియోగదారులు పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కూపన్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. పట్టణాల్లో వార్డు సిబ్బంది, గ్రామాల్లో గ్రామ వాలంటీర్లు తమ పరిధిలో కార్డుదారులకు రేషన్ పొందే తేదీని కూపన్లపై వేసి ఇచ్చారు. నిర్దేశిత తేదీ ప్రకారం లబ్ధిదారులు రేషన్ పొందేలా ఏర్పాటు చేశారు.
వీడని సర్వర్ కష్టాలు..