పశ్చిమగోదావరి జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కొవ్వూరు డివిజన్లోని 13 మండలాల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. పంచాయతీ ఎన్నికలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 6.30గంటలకు అన్ని చోట్ల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం మంచు కురుస్తుండటంతో పోలింగ్ కేంద్రం వద్ద జనాలు తక్కువగా ఉన్నారు. కొన్ని కేంద్రాల్లో 10 మంది కన్నా తక్కువగా ఓటర్లుండగా.. మరికొన్ని కేంద్రాల వద్ద ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. 300 లోపు ఓటర్లు ఉన్న వార్డులకు 1 చొప్పున, అంతకంటే ఎక్కువ ఓటర్లు ఉన్న వార్డులకు రెండు చొప్పున పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు కరోనాను దృష్టిలో ఉంచుకొని ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేశారు.
ప్రశాంతంగా ప్రారంభమైన రెండో దశ ఎన్నికలు - పశ్చిమగోదావరి జిల్లా తాజా వార్తలు
రెండో దశ పంచాయతీ ఎన్నికలు పశ్చిమగోదావరి జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. ఎన్నికలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
ఓటు హక్కును వినియోగించుకున్న వరుడు
పెళ్లి ఇంకో రెండు గంటల్లో ఉందనగా....
మరో రెండు గంటల్లో పెళ్లి ఉందనగా పెళ్లి కొడుకు అలంకారంలోనే వరుడు ఓటేసి వెళ్లిన సంఘటన ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కత్తుల చిరంజీవికి.. రాజమహేంద్రవరానికి సమీపంలోని గ్రామానికి చెందిన అమ్మాయితో ఉదయం 11 గంటలకు వివాహం జరగనుండగా తన బాధ్యతను గుర్తు చేసుకున్నాడు. పెళ్లి తతంగం జరుగుతుండగానే ఓటరు గుర్తింపు కార్డుతో వెళ్లి ఓటేశాడు.
Last Updated : Feb 13, 2021, 3:16 PM IST