పశ్చిమగోదావరిజిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగుతుండటంతో ఏలూరు జిల్లా ఆస్పత్రిని కొవిడ్ ఆస్పత్రిగా మార్చారు. కొవిడ్ తో బాధపడుతూ అత్యవసర పరిస్థితుల్లో వచ్చేవారికోసం ఆధునిక హంగులతో ఆస్పత్రిని తీర్చిదిద్దారు. ఆక్సిజన్ మానిటర్స్ తో కొవిడ్ ఎమర్జెన్సీ వార్డును ఏర్పాటు చేశారు. మూడు వందల పడకలను అందుబాటులో ఉంచారు. 10బైప్యాక్ మిషన్లు కూడా ఏర్పాటు చేశారు. జిల్లాలో కొవిడే కేర్ కేంద్రాల సంఖ్యను సైతం పెంచారు. తాడేపల్లిగూడెంలో నిట్, వాసవీ ఇంజనీరింగ్ కళాశాలల్లో కొవిడ్ కేర్ కేంద్రాలను ఐదు వందల పడకలతో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.
జిల్లాలో పలు ప్రాంతాల్లో మొబైల్ కొవిడ్ కేంద్రాల ద్వారా ర్యాపిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షలు చేయించుకోవడానికి ప్రజలు భారీగా వస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని అక్కడి నుంచే కొవిడ్ కేర్ కేంద్రాలకు పంపుతున్నారు.