ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామాల్లో ఎస్​ఈబీ అధికారుల తనిఖీలు.. గ్రామస్థులతో ఘర్షణ - west godavari district news

పశ్చిమగోదావరి జిల్లా టీ. నరసాపురం, కామవరపుకోట మండలాల్లో నాటుసారా తనిఖీలు ఘర్షణకు దారితీశాయి. ఒక వ్యక్తిని తనిఖీ చేస్తుండగా స్థానిక గ్రామస్థులు, పోలీసులకు మధ్య వివాదం చెలరేగి.. పరస్పరం దాడి చేసుకున్నారు.

conflict and fight between police and villagers
నాటుసారా కోసం ఎస్​ఈబీ తనిఖీ.. గ్రామస్తులతో ఘర్షణ

By

Published : Mar 31, 2021, 7:11 AM IST

నాటుసారా తరలిస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని తనిఖీ చేస్తుండగా.. స్థానికులకు పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. టీ. నరసాపురం, కామవరపుకోట మండలాల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై ఎస్​ఈబీ అధికారులు దాడులు నిర్వహిస్తుండగా.. సాయిపాలెంలో శేషయ్య అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా వెళ్లడం గమనించి అతని వాహనాన్ని తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా.. అక్కడే ఉన్న మరికొందరు అతడికి మద్దతుగా రావడంతో వారికి, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరువురు పరస్పరం దాడి చేసుకోగా.. గ్రామస్థులతో పాటు పోలీసులకు గాయాలయ్యాయి. నాటుసారా లేకపోయినా పోలీసులే కావాలని దాడి చేశారని స్థానికులు చెబుతున్నారు. కానీ పోలీసులు మాత్రం సారా సీసాను గమనించే ఆపామని అంటున్నారు. ఘటనలో 12మంది గ్రామస్థులపై పోలీసులు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవందడి:బాలికతో భిక్షాటన చేయిస్తున్న కిడ్నాపర్ అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details