ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Seasonal Fevers: జ్వరాల కాలం.. జాగ్రత్తలే మార్గం..! - corona cases in west godavari

వర్షాకాలం దూసుకువస్తుండటంతో విషజ్వరాల వ్యాప్తి మొదలైంది. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. వ్యాధులకు కారణమైన దోమల నివారణ, జ్వరాల నియంత్రణపై అధికారులు దృష్టి సారించారు.

fevers
జ్వరాల కాలం

By

Published : Jul 21, 2021, 11:50 AM IST

కొవిడ్ వ్యాప్తి ఇంకా పూర్తిగా తగ్గలేదు. అంతలోనే వర్షాకాలం వచ్చేసింది. విష జ్వరాల వ్యాప్తి సైతం మొదలైంది. ముఖ్యంగా మన్యం ప్రాంతాల్లో సాధారణ జ్వరాలే కాక.. మలేరియా, డెంగీ వంటి సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఈ ప్రభావం పశ్చిమ గోదావరి జిల్లాలో కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే గిరిజన గ్రామాల్లో అలజడి మొదలైంది. ఈ నేపథ్యంలో వ్యాధులకు కారణమైన దోమల నివారణ, జ్వరాల నియంత్రణకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

మన్యంలో చురుగ్గా చర్యలు

మన్యం ప్రాంతాలైన బుట్టాయగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు, జీలుగుమిల్లిలో ఏటా డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌, సాధారణ జ్వరాలు ఎక్కువగానే వస్తుంటాయి. ఏజెన్సీ, పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా విషజ్వరాలు వ్యాప్తి చెందే 172 గ్రామాలను గుర్తించారు. ఈ గ్రామాల్లో దోమల నివారణ కోసం జూన్‌ 1 నుంచి 15వ తేదీ వరకు మందులు చల్లారు. 2,52,417 దోమ తెరలను ఇప్పటికే పంపిణీ చేశారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ప్రత్యేక కార్యాచరణతో..

జిల్లాలో ఏటా డెంగీ జర్వాలు ఎక్కువగానే ప్రబలుతున్నాయి. 2019లో 433 కేసులు నమోదు కాగా 2020 నాటికి బాగా తగ్గి 87 కేసులకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 57 కేసులు నమోదయ్యాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న రోగుల వివరాలు లెక్కల్లోకి రావడం లేదు. మలేరియా కేసుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. గన్యా కేసులు రెండేళ్ల కిందట ఉన్నా ప్రస్తుతం నమోదు కావడం లేదు. దీంతో ఈసారి జులైను వైద్యాధికారులు డెంగీ నివారణ నెలగా ప్రకటించారు. జిల్లాలోని అన్ని పట్టణాల్లో జులై 1 నుంచి 31 వరకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఏఎన్‌ఎం, ఆశా, వాలంటీర్లతో కలిపి బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో వాలంటీరు తన పరిధిలోని 10 ఇళ్ల చొప్పున సందర్శించి, పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించాలి. ఈ కార్యక్రమాన్ని పురపాలక కమిషనర్లు, వైద్యఆరోగ్యశాఖ అధికారులు పర్యవేక్షిస్తారు.

దోమ తెరలు వాడాలి

జిల్లాలో గిరిజన, పురపాలక ప్రాంతాల్లో సీజనల్‌ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు కూడా జాగ్రత్తలు పాటిస్తే నివారణ సులభం అవుతుంది. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ఆవరణలో నీటినిల్వలు ఉండకుండా చర్యలు తీసుకోవాలి. దోమల నుంచి రక్షణకు అందరూ దోమతెరలు వినియోగించాలి. - పీఎస్‌ఎస్‌ ప్రసాద్‌, జిల్లా మలేరియా అధికారి

ఇదీ చదవండి:

UMKS FIRST DOCTORATE: యూఎంకేఎస్‌ చరిత్రలో తొలి డాక్టరేట్‌ సాధించిన మన్యం కుర్రాడు

రోబో సినిమాలో 'సనా' మాదిరి పరీక్ష రాద్దామనుకున్నాడు.. చివరికి!

ABOUT THE AUTHOR

...view details