ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'డ్రైవర్లూ.. 6 నెలలకోసారి ఆరోగ్యం పరీక్షించుకోండి' - transport department

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో రవాణాశాఖ ఆధ్వర్యంలో పాఠశాల బస్ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు హాజరయ్యారు.

అవగాహన సదస్సు

By

Published : Jun 22, 2019, 1:35 PM IST

రవాణాశాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లకు అవగాహన

రవాణాశాఖ ఆధ్వర్యంలో స్కూల్ బస్ డ్రైవర్లుకు అవగాహన, ఆరోగ్యపరీక్షలు నిర్వహించటం అభినందనీయమని పశ్చిమగోదావరిజిల్లా తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. శశి కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సును ఆయన ప్రారంభించారు. వాహనచోదకులు 6 నెలలకొకసారి వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం డ్రైవర్లందరికీ ఆరోగ్యకార్డును ఇస్తోందని.. వెయ్యిరూపాయల కంటే ఎక్కువగా ఖర్చయ్యే వైద్యాన్ని ఉచితంగా పొందవచ్చని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను.. ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

ABOUT THE AUTHOR

...view details