School Bus Accident:పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి వద్ద ఘోర ప్రమాదం తప్పింది. ఆర్అండ్బీ రహదారిపై ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులందరూ స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు. వీరిని తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తాడేపల్లిగూడేనికి చెందిన ఓ ప్రైవేటు స్కూల్లో పదో తరగతి విద్యార్థులకు ఏ.కే.రత్నం పేరిట ఇవాళ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష ముగిసిన అనంతరం ఓ పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులను ఎక్కించుకొని బయల్దేరింది.