భోగి పండుగ రోజున చిన్నపిల్లలకు భోగి పళ్లు పోస్తారు. చిన్నపిల్లలకు దిష్టి తగలడం సహజం. అందుకే.. వారికి అప్పటివరకూ ఉన్న దిష్టి మొత్తాన్ని తీసి పారేయడమే భోగి పండ్లు పోయడంలో రహస్యం. చిన్నారులకు పోసే భోగిపండ్లల్లో బంతిపూలు, నాణేలు కలుపుతారు. వాటిని దోసిళ్లతో తీసుకుని పిల్లల తలపై పోస్తారు. ఏ కాలంలో దొరికే పండ్లను ఆ కాలంలో తింటే ఆరోగ్యం. పిల్లలకు వాటిపై ఆసక్తి కలిగేంచేందుకేనని పెద్దలు చెబుతారు.
చిన్నపిల్లలకు భోగిపళ్లు ఎందుకు పోస్తారు? - సంక్రాంతి భోగిపళ్లు న్యూస్
ముచ్చటైన మూడు రోజుల పండగ సంక్రాంతి. మెుదటి రోజు భోగి. అయితే భోగి రోజున చిన్నపిల్లలకు భోగిపళ్ల(రేగిపళ్లు) పోయడం మన సంప్రదాయం. ఈ పళ్లను పోయడం వెనక ఓ కథ ఉంది.
చిన్నపిల్లలకు భోగిపళ్లు ఎందుకు పోస్తారు?
రేగి పండును అర్కఫలం అంటారు. ‘అర్కుడు’ అంటే సూర్యుడు. భోగి మరునాడు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు వెళ్తాడు. అందుకే.. ఆయన కరుణాకటాక్షాలు పిల్లలపై పడాలనే ఉద్దేశంతో పిల్లలకు భోగిపళ్లు పోస్తారట.
ఇదీ చదవండి: ఓహో భోగి మంటలు ఇందుకోసమేనా..!