ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉప్పు రైతుకు లాక్​డౌన్​తో ముప్పు - salt farmers latest news update

ఎలాంటి వంటకానికైనా ఉప్పు లేనిదే రుచి ఉండదు. మరి ఉప్పును పండించే రైతుల బతుకుల్లో రుచి ఉందా అంటే లేదనే చెప్పాలి. తరతరాలుగా ఈ పంటనే నమ్ముకున్న వారి జీవితాలు.. చప్పగా కన్నీటి కడలిలోనే కరిగి పోతున్నాయి. లాక్​డౌన్​తో ఉప్పు ఎగుమతులు ఆగిపోయి పరిస్థితి మరింత దయానీయంగా మారింది.

salt farmers suffering from lock down
ఉప్పు రైతుకు లాక్​డౌన్​తో ముప్పు

By

Published : May 17, 2020, 1:03 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం బియ్యపుతిప్ప నుంచి మొగల్తూరు మండలం మోళ్ళపర్రు వరకు 19 కిలో మీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. ఆ తీరాన్ని ఆనుకుని ఉన్న 9 గ్రామల ప్రజలుకు ఉప్పు సాగే జీవనాధారం. జనవరిలో ప్రారంభమైన ఉప్పు సాగు మార్చి మొదటి వారంలో అందుబాటులోకి వస్తుంటుంది. చేతికి అంది వచ్చిన సాగును అమ్ముకునేందుకు రైతులు ఉప్పును గట్టుకు తరలించి గుట్టలు పోసి సిద్దం చేస్తుంటారు.

ఈ సమయంలో కరోనా వైరస్ వ్యాప్తితో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో ఎగుమతులు లేక ఉప్పు గుట్టలుగానే నిలిచిపోయింది. మంచి సీజన్ సమయంలో విక్రయాలు సాగాల్సిన ఉప్పు పంటను కొనే నాధుడు లేక.. దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.

పంటగా గుర్తించని ప్రభుత్వం...

ఇప్పటి వరకు ఉప్పు సాగును ప్రభుత్వం పంటగా గుర్తించ లేదు. అప్పులు చేసి రైతులు ఉప్పు సాగు చేస్తుంటే పంట చేతికొచ్చిన తర్వాత వ్యాపారులు నచ్చిన ధరకు తీసుకుంటున్నారు. మద్దతు ధర అడిగితే అప్పులు తీర్చాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇలా దళారుల దందా, తూకాల్లో మోసాలు, వడ్డీ వ్యాపారుల ఆగడాలతో ఉప్పు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నేటికీ ఉప్పు మడులు వద్దకు వెళ్ళేందుకు సరైన రవాణా మార్గాలు లేవు. విద్యుత్ సౌకర్యం లేదు. ఉప్పును భద్రపరిచే గోదాములూ లేవు. ఫలితంగా పంటను రహదారి సమీపంలోకి తరలించడం భారంగా మారుతోంది.

ఆదుకోవాలని కోరుతున్న రైతులు...

జిల్లాలో 2004 నుంచి పరిశీలిస్తే భారీ వర్షాలు కాకుండా పది సార్లు విపత్తులు సంభవించాయి. ఆరు వేల ఎకరాల్లో రూ. 3 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా ఉప్పు రైతులకు సాయం అందలేదు. దీనివల్ల ఉప్పు సాగుబడి తగ్గుతూ వస్తోంది. పంటగా గుర్తించి పూర్వ వైభవం తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. ఆధునిక పద్ధతుల అమలతో పాటు సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చూడండి:

'మమ్మల్ని పంపించకుంటే ఆత్మహత్య చేసుకుంటాం'

ABOUT THE AUTHOR

...view details