పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ పరిధిలో రైతు భరోసా కేంద్రాలను శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రారంభించారు. ప్రభుత్వం రైతులకు అండగా నిలవటం కోసమే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని అన్నారు. రైతులకు అవసరమైన అన్ని రకాల సహాయాలను ఈ కేంద్రాల ద్వారా అందించేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. రైతులు ఈ కేంద్రాలను సద్వినియోగపరుచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
'రైతు భరోసా కేంద్రాలను సద్వినియోగపరుచుకోవాలి' - latest tanuku news
తణుకు నియోజకవర్గ పరిధిలో వివిధ గ్రామాలలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులకు సాంకేతిక సహాయాన్ని అందించటంతోపాటు పండించిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించటం, పంటల బీమా, ఎరువులు, పురుగుల మందులు అందుబాటులో ఉంచటానికి ఈ కేంద్రాలు ఉపయోగపడతాయని అన్నారు.
తణుకు నియోజకవర్గంలో రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం