RSS chief Mohan Bhagwat: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆర్‌ఎస్‌ఎస్ సభ జరిగింది. కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరయ్యారు. అనంతరం 'శివాజీ జీవిత చరిత్ర' పుస్తకాన్ని ఆవిష్కరించారు.
హిందూ ధర్మం ఆచరించే వారిని సంఘటితం చేయాలి. మనం ఎవరినీ శత్రువుగా చూడం. ఎవరిదీ మతం మార్చాలని మనం చూడలేదు.. చూడం. కొందరు ప్రలోభాలకు గురిచేసి మతం మారుస్తున్నారు. ప్రలోభాలకు లొంగకుండా మనం ధర్మాన్ని కాపాడుకోవాలి. భారత్ పునః వైభవం సాధించాలని దేవుడిని కోరుతున్నా. -మోహన్ భగవత్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్