పోలవరం ప్రాజెక్టులో రూ.3,222 కోట్ల దోపిడీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితెరలేపారని మాజీమంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. పెంచిన అంచనా వ్యయం రూ.3,222 కోట్లతో పాటు ఇసుక పేరుతో పెంచిన రూ.569 కోట్ల వ్యవహారంపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పోలవరంలో రూ.3222 కోట్ల దోపిడీ: దేవినేని ఉమా
మాజీమంత్రి దేవినేని ఉమా సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టులో రూ.3,222 కోట్ల దోపిడీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెరలేపారని ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎవరి కోసం ఒక్కరోజులోనే రూ.2569 కోట్లకు పోలవరం హెడ్ వర్క్స్ డ్యామ్ పనుల అంచనాలు పెంచారు..? కాంట్రాక్ట్ పొందిన ఏజెన్సీ కోసమే ఈ అంచనాలు పెంచారా?. దీనిపై ముఖ్యమంత్రి లేదా సంబంధిత శాఖ మంత్రి ఎందుకు వివరణ ఇవ్వలేదు. పోలవరం జలవనరుల ప్రాజెక్టును ఎత్తిపోతల పథకంగా మార్చేసిన సీఎం కోట్లాది ప్రజల ఆశలను నీరుగార్చారు. హెడ్ రెగ్యులేటర్ దగ్గర రూ.912కోట్లతో ఎత్తిపోతల పథకం రూపొందించి కృష్ణా, గోదావరి డెల్టాలను సీఎం ఉద్ధరిస్తారా..? పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం 196 టీఎంసీల నిల్వసామర్థ్యంతో జరగాలి. రాజశేఖర్ రెడ్డి హాయాంలో ఫోర్స్ ఫుల్ క్లోజర్తో పనులు ఆపేయించి, పోలవరం పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలన్న దుర్మార్గపు ఆలోచనతోనే దాదాపు రూ.3వేల కోట్ల వరకు నిర్మాణ వ్యయం పెరిగింది. -దేవినేని ఉమా, మాజీమంత్రి
ఇదీ చదవండీ... 18 ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్: జగన్