పశ్చిమగోదావరి జిల్లా మల్లిపూడి గ్రామంలోని శ్రీరామలింగేశ్వర రైస్ మిల్లు ఎదుట తమ డబ్బులు చెల్లించాలని అన్నదాతలు ధర్నా చేపట్టారు. మిల్లును సుందర రామిరెడ్డి, మరో భాగస్వామితో కలిసి నిర్వహించేవారు. వీరిద్దరూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయటంతో పాటు పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించారు.
మొండిచెయ్యి..
మూడేళ్ల క్రితం భాగస్వామి మృతి చెందటంతో సుందరరామిరెడ్డి ఒక్కరే బియ్యం మిల్లును నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి ధాన్యం సరఫరా చేసిన రైతులకు డబ్బులు తిరిగి ఇవ్వకపోగా, డిపాజిట్దారులకు మొండిచెయ్యి చూపిస్తూ వస్తున్నారు. రైతులు సరఫరా చేసిన ధాన్యానికి, వారి డిపాజిట్లకు, స్థానికుల జమ చేసుకున్న మొత్తం కలిపి సుమారు రూ. 20 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.