తెలంగాణ నుంచి రాష్ట్రానికి తరలిస్తోన్న భారీగా మద్యాన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) అధికారులు పట్టుకున్నారు. సరిహద్దు ప్రాంతమైన పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి చెక్‌పోస్టు వద్ద మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం విలువ సుమారు 20 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు ప్రాథమిక అంచనా.
మొత్తం 4300 మద్యం బాటిళ్లను ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మద్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసిన అధికారులు.. డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. జంగారెడ్డిగూడెంకు చెందిన మద్యం మాఫియా ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.