పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి రాష్ట్ర సరిహద్దు వద్ద పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో ఎటువంటి అనుమతి లేకుండా ద్విచక్రవాహనంపై తరలిస్తున్న రూ. 17లక్షల నగదు పట్టుబడింది. ఇదిలా ఉండగా కారులో తరలిస్తున్న మరో రూ.11.76 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. మొత్తంగా రూ. 28.76 లక్షల నగదుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు జీలుగుమిల్లి ఎస్సై విశ్వనాథబాబు తెలిపారు. డబ్బు ఎక్కడినుంచి వచ్చిందంటూ నిందితుల్ని విచారిస్తున్నారు.
రాష్ట్ర సరిహద్దులో రూ. 28.76 లక్షల నగదు సీజ్.. - జీలుగుమిల్లి అక్రమ నగదు పట్టివేత
ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్నమొత్తం రూ. 28.76 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి రాష్ట్ర సరిహద్దు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ నగదు పట్టుబడింది.
పశ్చిమగోదావరిలో అక్రమ డబ్బు సీజ్
Last Updated : Jul 1, 2020, 6:44 PM IST