'రొయ్యల ప్లాంట్ తొలగించాలి' పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం లోసరి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమ గ్రామంలోనిరొయ్యలు శుభ్రం చేసే ప్లాంట్ వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ అనుమతి లేకుండా... నివాస ప్రాంతాలను ఆనుకుని ఈ పరిశ్రమ ఉన్న కారణంగా..గాలి, నీరు పూర్తిగా కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఇప్పటికే రోగాలతో బాధపడుతున్నామని.. ప్లాంటు తొలిగించే వరకు తమ నిరసన కొనసాగిస్తామన్నారు. ఈ పరిణామంతో.. సంస్థలోని కార్మికులురహదారిపైనే నిలిచిపోయారు. పోలీసులు గ్రామస్తులతో మాట్లాడారు.ఫ్యాక్టరీ యజమానులతోనూ చర్చించిఫ్లాట్ల నిర్వహణ ఆపించారు. ఆ తర్వాతే గ్రామస్థులు ఆందోళన విరమించారు.
ఇవీ చదవండి..