ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నదాతను కాటేస్తున్న రొయ్య - పశ్చిమగోదావరిజిల్లా

పచ్చని గోదావరిడెల్టాను రొయ్యకాలుష్యం కాటేస్తోంది. వరినారుమడులను నిలువునా కబళిస్తోంది. డెల్టా ప్రాంతంలో ఇప్పటికే రొయ్యల చెరువుల వ్యర్థజలాల వల్ల.. వందల ఎకరాల నారుమడులు దెబ్బతిన్నాయి. పదే పదే  వరినారుమడులు వేసుకోవలసి వస్తోంది.

అన్నదాతను కాటేస్తున్న రొయ్య

By

Published : Aug 2, 2019, 5:31 PM IST


వరిసాగు వీస్తీర్ణంలో పశ్చిమగోదావరిజిల్లా డెల్టా ముందంజలోఉంటుంది. రికార్డుస్థాయిలో దిగుడులు సాధించిన రైతులు.. నేడు వరినారుమడులుసైతం సంరక్షించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. రొయ్యచెరువుల వ్యర్థజలంతో నారుమడులు ఎండిపోతున్నాయి. విషపూరిత రసాయనాలు, ఉప్పుతో నిండిన నీరు పంటకాలువుల్లో చేరి... అన్నదాతను ముంచుతోంది. మొలకలు సైతం రాని దుస్థితి నెలకొంది. వందల ఎకరాలు దెబ్బతిన్నాయి. ఒకసారి నారుమడులు వేసుకోవడానికి ఎకరాకు దాదాపు 3వేల రూపాయలు ఖర్చుచేయాలి. పదే పదే వేసుకోవాలంటే ఖర్చు ఎక్కువవుతోంది. సాగు సైతం ఆలస్యమవుతోంది. భీమవరం, పాలకొల్లు, నరసాపురం, ఉండి, ఆచంట ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. ఇష్టారాజ్యంగా తవ్వే రొయ్యల చెరువులతోనే ఈ దుస్థితి నెలకొంది.

ఆక్వాసాగు లాభాలు కురిపిస్తుడటం వల్ల.. పచ్చని పొలాలను చెరువులుగా మారుస్తున్నారు. ఆయకట్టు మధ్యలో చెరవులు తవ్వి రొయ్యలు సాగుచేస్తున్నారు. పంటపూర్తయ్యాక.. రొయ్యల చెరువు నీటిని పంటకాలువలోకి వదులుతున్నారు. జిల్లాలో వరిసాగు 2.54లక్షల హెక్టార్లలో విస్తరించింది. రొయ్యలసాగు అధికారికంగా 52వేల ఎకరాల్లో మాత్రం ఉంది. అనధికారికంగా1.78లక్షల ఎకరాల్లో రొయ్యలసాగు చేపడుతున్నారు. భీమవరం మండలంలో 42వేల ఎకరాల్లో వరిసాగు జరిగేది. ప్రస్తుతం 16వేల ఎకరాల్లోనే చేస్తున్నారు. పాలకోడేరుమండలంలో 22వేల ఎకరాలు వరి సాగు ఉండేది.. నేడు 14వేల ఎకరాలకు పడిపోయింది.

ఉప్పునీటి వ్యర్థాలతో నిండిన రొయ్యల చెరువు నీరు.. వరిసాగును ప్రశ్నార్థకం చేస్తోంది. అధికారులు స్పందించి.. అనధికార రొయ్యలసాగును నియంత్రించాలని కోరుతున్నారు.

అన్నదాతను కాటేస్తున్న రొయ్య

ఇవీ చదవండి

వణుకుతున్న గోదావరి లంక గ్రామాలు

ABOUT THE AUTHOR

...view details