గురుకుల పాఠశాలల విద్యార్థుల కోసం పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన రొబోటిక్స్ శిక్షణ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. తాడేపల్లిగూడెం గురుకుల పాఠశాలలో 3 జిల్లాలకు చెందిన 60 మంది విద్యార్థులకు దసరా సెలవుల్లో ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించారు. ప్రధాన సబ్జెక్టుగా రోబోల పనితీరుపై అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేశారు. రోబోలు మానవాళికి అందిస్తున్న సేవలు, భవిష్యత్తులో రాబోయే మార్పులు విద్యార్థులకు వివరించారు. ముగ్గురు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో రొబోటిక్ శిక్షణా తరగతులు సాగాయి. 7, 8, 9 తరగతుల విద్యార్థులు చిన్నపాటి రోబోలు స్వయంగా తయారు చేసి సంతోషం వ్యక్తం చేశారు.
గురుకుల పాఠశాలల విద్యార్థులకు రోబోటిక్స్ శిక్షణ - చిన్నారులకు రోబోటిక్స్ శిక్షణ
ఏపీ గురుకుల విద్యార్థులకు పాఠశాల స్థాయిలోనే రోబోటిక్స్‌పై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. విద్యార్థుల్లో దాగున్న సృజనను వెలికితీసి మారుతున్న కాలంతోపాటు వారిని పోటీ ప్రపంచంలో నిలబెడుతున్నారు. పలువురు విద్యార్థులు సైతం శిక్షణలో రోబోలు తయారుచేసి తమ ప్రతిభను ప్రదర్శించారు.

రోబోలు
గురుకుల పాఠశాలల విద్యార్థులకు రోబోటిక్స్ శిక్షణ
థియేటర్ వర్క్ షాప్, పజిల్స్, గేమింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాల శిక్షణ సైతం నిర్వహించారు. చదువులతో పాటు ఇతర నైపుణ్యాల ప్రాధాన్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎన్నో శిక్షణా శిబిరాల్లో పాల్గొన్న తమకు ఈ కార్యక్రమం అత్యంత సంతృప్తినిచ్చిందని విద్యార్థులు పేర్కొన్నారు.