పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో రెండు ఇళ్లలో జరిగిన చోరీలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆర్. మల్లికార్జున రెడ్డి తెలిపారు. స్థానిక 18వ వార్డుకు చెందిన జులేఖ బేగం, శివరామయ్య వారి ఇళ్లకు తళాలు వేసి విజయవాడ, రామచంద్రాపురంలో ఉంటున్న కుమార్తెల వద్దకు వెళ్లారు. తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించిన పొరుగువారు యజమానులకు సమాచారం ఇచ్చారు.
వారు వచ్చి చూసేసరికి వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. జులేఖ బేగం ఇంట్లో రూ. 30వేలు, 8 గ్రాముల బంగారం , 100 గ్రాముల వెండి ఆభరణాలు.. శివరామయ్య ఇంట్లో బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.